Uttam Kumar Reddy: సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ వదంతులను నమ్మొద్దు: ఉత్తమ్‌ సూచన

uttam slams trs congress

  • దుబ్బాక ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు
  • శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నట్లు  అసత్య ప్రచారం
  • దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం
  • ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు

దుబ్బాక ఉప ఎన్నిక అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు నకిలీ వార్తలు వ్యాప్తి చేస్తుండడం పట్ల టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికను ప్రభావితం చేయడానికి కొందరు దుర్మార్గులు ప్రయత్నాలు జరుపుతున్నారంటూ చెప్పారు.

శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నట్లు  అసత్యప్రచారం చేస్తున్నారని. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆ వదంతులను నమ్మవద్దని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ, టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి  నిజాయతీగల వ్యక్తి అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన సమయంలో ఈ నకిలీ వార్తను సోషల్ మీడియాలో పెట్టారని ఆయన వివరించారు.

Uttam Kumar Reddy
Congress
TRS
dubbaka
  • Loading...

More Telugu News