Jerusalema: ప్రపంచమంతా తెగ వైరల్ అవుతున్న 'జెరూసలేమా...' సాంగ్... మీరు చూశారా?!

Angolan Dance Troup Performing Jerusalema Song

  • హిట్ పాటకు ఆంగోళన్ ట్రూప్ డ్యాన్స్
  • భోజనం చేస్తూ నృత్యం 
  • ఉర్రూతలూగుతున్న వీక్షకులు

సౌతాఫ్రికాలో సూపర్ డూపర్ హిట్ అయిన 'జెరూసలేమా... ఇకయ్యా లామీ' (జెరూసలేం నా ఇల్లు) పాట గురించి తెలుసా? గతంలోనే ఈ పాట విడుదలై వైరల్ గా మారింది. ఇప్పుడు ఇదే పాటకు ఆంగోలన్ డ్యాన్స్ ట్రూప్ చేసిన నృత్యం, ప్రపంచ సంగీత, నృత్య శ్రోతలను ఉర్రూతలూగిస్తోంది. తమ చేతుల్లో ప్లేట్లు పట్టుకుని భోజనం చేస్తూ, వారు చేసిన నృత్యానికి ప్రపంచం ఫిదా అయింది. ఇప్పటికే ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

కరోనా వైరస్ విజృంభిస్తున్న రోజుల్లో, భౌతిక దూరాన్ని పాటిస్తూ, ఈ పాటను చేసిన ఆంగోలన్ డ్యాన్స్ ట్రూప్, 'జెరూసలేమా డ్యాన్స్ చాలెంజ్'ని విసరగా... రోజుల వ్యవధిలోనే ఆఫ్రికా పోలీసు అధికారుల నుంచి, యూరప్ లోని మతాధికారుల వరకూ దీన్ని స్వీకరించి, తమతమ నృత్యాలను పోస్ట్ చేయడం గమనార్హం.

ఈ పాటలో 'జెరూసలేమా..' అనే పదంలో 'ఆశ' అనే అర్థం కూడా దాగుండటంతో కరోనా నుంచి ప్రపంచం త్వరగా బయట పడాలని కోట్లాది మంది కోరుకుంటున్నారు. ఈ పాటను జొహనాస్ బర్గ్ నగరానికి చెందిన సంగీత కళాకారుడు మాస్టర్ కేజీ రూపొందించారు. నవంబర్ 2019లో ఈ పాటకు రూపకల్పన జరిగింది. కాగా, జెరూసలేమ్ నగరం మూడు మతాలకు ఎంతో ప్రసిద్ధి చెందిన నగరమన్న సంగతి తెలిసిందే.

Jerusalema
Song
Video
Angolan
  • Error fetching data: Network response was not ok

More Telugu News