Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

Keerti Suresh put off weight for Miss India film
  • పాత్ర కోసమే బరువు తగ్గానంటున్న కీర్తి 
  • రవితేజ 'ఖిలాడీ' షూటింగ్ మొదలైంది
  • ప్రభాస్ సినిమాలో మరో బాలీవుడ్ నటి
*  'మిస్ ఇండియా' చిత్రం కోసం తాను బాగా సన్నబడ్డానని చెబుతోంది కథానాయిక కీర్తి సురేశ్. 'ఈ సినిమాలోని పాత్ర తీరుతెన్నుల్ని బట్టి నేను కాస్త సన్నగా కనపడాలి. అందుకే వర్కౌట్స్ చేసి బరువు తగ్గాను. దీని కోసం చాలా కష్టపడ్డాను' అని చెప్పింది కీర్తి. కాగా, ఈ చిత్రం ఈ నెల 4న నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలవుతోంది.  
*  రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. మరోపక్క, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన 'క్రాక్' చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తారు.
*  ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు వార్తలొస్తున్నాయి.
Keerti Suresh
Raviteja
Prabhas
Kajol

More Telugu News