Delhi Capitals: ఐపీఎల్ లో నేడు ఢిల్లీ వర్సెస్ బెంగళూరు... టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్

Delhi Capitals faces Royal Challengers Banglore
  • అబుదాబి వేదికగా కీలక మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • చెరో ఏడు విజయాలతో ఉన్న ఢిల్లీ, బెంగళూరు
ఐపీఎల్ లో మరికొన్నిరోజుల్లో ప్లేఆఫ్ దశ ప్రారంభం కానుండగా, లీగ్ దశ చివరికొచ్చేసింది. ఇవాళ అబుదాబి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే 9 విజయాలతో పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా, రెండోస్థానం కోసం బెంగళూరు, ఢిల్లీ తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటివరకు చెరో 13 మ్యాచ్ లు ఆడి ఏడేసి విజయాలు సాధించాయి. గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంటుంది.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే... ఈ పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రహానే, అక్షర్, డేనియల్స్ శామ్స్ లకు ఢిల్లీ తుది జట్టులో స్థానం కల్పించారు. బెంగళూరు జట్టులో రెండు మార్పులు జరిగాయి. గుర్ కీరత్ మాన్, నవదీప్ సైనీ స్థానంలో శివం దూబే, షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చారు.
Delhi Capitals
Royal Challengers Banglore
Toss
Bowling
IPL 2020

More Telugu News