Pawan Kalyan: సెట్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్!

Pawan joins Vakeel Saab shoot

  • టాలీవుడ్ కి తిరిగొచ్చిన షూటింగుల కళ 
  • గత నెలలో మొదలైన 'వకీల్ సాబ్' షూట్
  • నిన్న పవన్ పై కోర్టు సన్నివేశాల చిత్రీకరణ
  • సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాలు  

లాక్ డౌన్ కారణంగా ఏడు నెలల పాటు ఆగిపోయిన సినిమాల షూటింగులు ఇటీవలే మళ్లీ మొదలయ్యాయి. కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ.. తక్కువ మంది యూనిట్ సభ్యులతో ఆయా సినిమాల షూటింగులు నిర్వహిస్తున్నారు. చాలావరకు షూటింగులు హైదరాబాదులోనే కొనసాగుతుంటుంటే.. ఒకళ్లిద్దరు విదేశాలకు వెళ్లి కూడా షూటింగులు చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ కి షూటింగుల కళ మాత్రం తిరిగొచ్చింది.

ఈ క్రమంలో ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ కూడా నిన్న షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వకీల్ సాబ్' చిత్రంలో ఆయన నటిస్తున్న సంగతి విదితమే. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రం షూటింగ్ కొంత భాగం జరిగింది. గత నెలలోనే ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో ప్రారంభించగా, ఇన్నాళ్లూ పవన్ లేని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇక నిన్న పవన్ షూటింగులో జాయిన్ కావడంతో సెట్లో సందడి నెలకొంది. కోర్టు సీనుకు సంబంధించిన సన్నివేశాలను పవన్ పై నిన్న చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో శ్రుతి హాసన్, నివేద థామస్, అంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో వచ్చిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తో కలసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Pawan Kalyan
Shruti Hassan
Anjali
Niveda Thamos
  • Loading...

More Telugu News