Chiranjeevi: మనవరాళ్లతో కలిసి కేఎఫ్ సి తరహా చికెన్ వండిన చిరంజీవి

Megastar Chiranjeevi prepares KFC style chicken

  • ఇన్ స్టాగ్రామ్ లో చిరంజీవి పోస్టు
  • కరోనా సమయంలో బయటి తిండి వద్దన్న మెగాస్టార్
  • ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని వ్యాఖ్యలు

ఇటీవలే సోషల్ మీడియాలో ప్రవేశించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన పోస్టులతో అలరిస్తున్నారు. తాజాగా ఆయన తన మనవరాళ్లతో కలిసి కేఎఫ్ సీ తరహా చికెన్ వండిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ కరోనా సమయంలో బయటి నుంచి తెచ్చుకోవడం కంటే ఇంట్లోనే తయారుచేసుకోవడం మేలని చిరు పేర్కొన్నారు.

తన మనవరాళ్లు సంహిత, నివ్రితిలు ఎంతో అనుభవమున్న వంటవాళ్లలా చికెన్ లెగ్ పీసులను మారినేట్ చేయడం చూసి చిరు అచ్చెరువొందారు. మీరు బజార్లో బండి పెట్టుకుని కేఎఫ్ సీ చికెన్, కేఎఫ్ సీ చికెన్ అంటూ హాయిగా అమ్ముకోవచ్చు అంటూ చమత్కరించారు. ఆపై ఆ చిన్నారులకు ఎలా చికెన్ లెగ్ పీసులను నూనెలో వేయించాలో చూపారు.  ఆపై పిల్లలు ఆ చికెన్ లెగ్ పీసులు కేఎఫ్ సీ కంటే బాగున్నాయని చెప్పడంతో చిరంజీవి సంతోషంగా ఫీలయ్యారు.

Chiranjeevi
Grand Daughters
KFC
Chicken
Tollywood
  • Loading...

More Telugu News