Rakul Preet Singh: ఇదేమీ వెర్రి కాదు... ఇదొక జీవనవిధానం: రకుల్ ప్రీత్

Rakul Preet convey her wishes on World Vegan Day

  • నేడు ప్రపంచ శాకాహార దినోత్సవం
  • సోషల్ మీడియాలో విషెస్ తెలిపిన రకుల్
  • శాకాహారం అంటే ఆకు కూరలు తినడం మాత్రమే కాదని వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరోయిన్లలో ఫిట్ నెస్ విషయంలో అందరికంటే ముందుండే భామ రకుల్ ప్రీత్ సింగ్. షూటింగ్ తో పనిలేకుండా ఫిట్ నెస్ ఎక్సర్ సైజులతో నిత్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై రకుల్ ఎంతో శ్రద్ధ చూపుతుంది. ఇవాళ ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది. ఓ శాకాహారిగా తాను చాలా రకాల ఆహారం తినగలనని పేర్కొంది.

శాకాహారం అంటే కేవలం ఆకు కూరలు తినడం మాత్రమే కాదని వివరించింది. శాకాహారం అనేది ఓ జీవన విధానం అని స్పష్టం చేసింది.  అంతేతప్ప, ఇదొక ఆహార పద్ధతి అని, వెర్రి అని భావించనక్కర్లేదు అంటూ స్పష్టం చేసింది. రొట్టె, పప్పు, ఓ కూర ఎంత సింపులో, శాకాహారం కూడా అంతే సింపుల్ అంటూ ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసింది.

Rakul Preet Singh
World Vegan Day
Diet
Vegan
Lettuce
  • Loading...

More Telugu News