Suma: క్యాష్‌ షోలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న సుమ!

SUMA gets emotional

  • క్యాష్‌ షోలో తన తల్లి గురించి చెప్పిన బజర్దస్త్ కార్తిక్
  • తన తల్లి యోధురాలు అని వ్యాఖ్య
  • 30 కిమోలు, రెండు మేజర్‌ సర్జరీలు జరిగాయని తెలిపిన కార్తిక్ 
  • తనకు వచ్చిన డబ్బులతో బతికించుకోగలిగానని వ్యాఖ్య

క్యాష్‌ షోలో భావోద్వేగానికి గురై యాంకర్ సుమ కన్నీరు పెట్టుకుంది. ఈ షోకి బుల్లితెర నటుడు కార్తిక్ వచ్చి పలు విషయాలు చెప్పాడు. తన తల్లి గురించి మాట్లాడుతూ తన తల్లి యోధురాలు అని, రెండు సంవత్సరాల నుంచి 30 కిమోలు, రెండు మేజర్‌ సర్జరీలు చేయించుకుందని తెలిపాడు. అలాగే, తనకు పేరు తెచ్చిన జబర్దస్త్ షోకి తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన చెప్పాడు.

తన లాంటి ఎంతోమంది కమెడియన్లు జబర్దస్త్ కు వచ్చాకే కడుపునిండా తినగలుగుతున్నామని, ఇళ్లు, కార్లు కొనుక్కున్నామని తెలిపాడు. దీంతో తనకు మంచి పేరు వచ్చిందని, తనకు వచ్చిన డబ్బులతో తమ తల్లిని బతికించుకోగలిగానని చెప్పాడు. దీంతో యాంకర్ సుమ కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను క్యాష్ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ షోలో కార్తీక్‌తో పాటు వర్షిణి, రవి, భాను కూడా పాల్గొన్నారు. వారితో పాటు వారి తల్లులు ఈ షోలో కనపడనున్నారు.
 

Suma
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News