IYR Krishna Rao: ఇప్పుడు ఆ అంశాన్ని వక్రీకరించి ప్రస్తావించాల్సిన అవసరంలేదు: ఐవైఆర్

IYR Krishna Rao responds to a media story on Polavaram

  • పోలవరంలో మరింత కోత? అంటూ మీడియాలో కథనం
  • నాడు చంద్రబాబు నిర్ణయం సహేతుకమన్న ఐవైఆర్
  • విద్యుత్ కేంద్రం తామే నిర్మిస్తామన్నారని వెల్లడి

పోలవరంలో మరింత కోత? అంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై మాజీ ఐఏఎస్ అధికారి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. సదరు దినపత్రిక వారికి అధికారంలో ఎవరున్నారనే దాన్ని బట్టి కొన్ని అంశాలు వేర్వేరుగా అర్థమయ్యేటట్లు ఉన్నాయని ఆయన విమర్శించారు. విద్యుత్ కేంద్రానికి కేంద్ర సహాయం అవసరంలేదని, తామే నిర్మిస్తామని నాడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అది సహేతుకమైన నిర్ణయం అని పేర్కొన్నారు.

"ఎందుకంటే... కేంద్ర నిధులతో జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తే ఉత్పత్తి అయ్యే విద్యుత్ పంపిణీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఉంటుంది. రాష్ట్ర నిధులతో నిర్మిస్తే దాని పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అలాంటప్పుడు ఆ అంశాన్ని ఇప్పుడు వక్రీకరించి ప్రస్తావించాల్సిన పనిలేదు" అంటూ ఆ పత్రికకు హితవు పలికారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News