Antrix: బెంగళూరు స్టార్టప్ కు 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఇస్రో యాంట్రిక్స్ ను ఆదేశించిన అమెరికా న్యాయస్థానం

US Court orders ISRO Antrix to pay Bengaluru startup

  • 2005లో యాంట్రిక్స్ తో దేవాస్ సంస్థ ఒప్పందం
  • రెండు శాటిలైట్ల కోసం ఒప్పందం
  • 2011లో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న యాంట్రిక్స్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వాణిజ్య విభాగం యాంట్రిక్స్ కార్పొరేషన్ చిక్కుల్లో పడింది. బెంగళూరుకు చెందిన దేవాస్ మల్టీమీడియా సంస్థకు 1.2 బిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించాలంటూ యాంట్రిక్స్ ను ఓ అమెరికా కోర్టు ఆదేశించింది. 2005లో దేవాస్ మల్టీమీడియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని యాంట్రిక్స్ రద్దు చేసుకున్నందుకు ఈ విధమైన తీర్పు వెలువరించింది.

 దేవాస్ మల్టీమీడియా కోసం రెండు అత్యాధునిక కమ్యూనికేషన్ శాటిలైట్ల నిర్మాణం, ప్రయోగం, నిర్వహణ చేపడతామని యాంట్రిక్స్ 2005లో ఒప్పందం కుదుర్చుకుంది. 70 మెగాహెర్ట్జ్ ల ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ తో ప్రసారాలు అందించేందుకే వీలుగా దేవాస్ ఈ ఒప్పందం చేసుకుంది. అయితే తదనంతర కాలంలో హైబ్రిడ్ శాటిలైట్ సాయంతో భారతదేశ వ్యాప్తంగా ప్రాదేశిక భూభాగంపై కమ్యూనికేషన్ సేవలు అందించాలని దేవాస్ మల్టీమీడియా భావించింది. ఈ నేపథ్యంలో యాంట్రిక్స్ సంస్థ ఈ ఒప్పందాన్ని 2011లో రద్దు చేసింది.

భారత్ లో ఎన్నో న్యాయస్థానాలను ఆశ్రయించినా దేవాస్ సంస్థకు అనుకూల తీర్పు రాలేదు. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. కాగా, యాంట్రిక్స్, అమెరికాకు చెందిన స్పేస్ ఫ్లైట్ ఇండస్ట్రీస్ సంస్థల మధ్య శాటిలైట్ ప్రయోగాలకు సంబంధించిన కీలక ఒప్పందం ఉన్న నేపథ్యంలో... దేవాస్ సంస్థ అమెరికాలోని కోర్టును ఆశ్రయించింది. విచారణ పూర్తయిన పిమ్మట న్యాయమూర్తి థామస్ ఎస్ జిల్లీ దేవాస్ మల్టీమీడియాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. వడ్డీతో కలిపి మొత్తం 1.2 బిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News