Nithish Rana: మెరిసిన రాణా.... కోల్ కతా భారీస్కోరు

Nithish Rana registers a fine innings against CSK

  • ఐపీఎల్ లో నేడు  కోల్ కతా వర్సెస్ చెన్నై
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసిన కోల్ కతా
  • 87 పరుగులు చేసిన రాణా

చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో ఓపెనర్ నితీశ్ రాణా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. రాణా 61 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులతో 87 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 26, దినేశ్ కార్తీక్ 21 పరుగులతో రాణించగా... కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది.

ఎడమచేతి వాటం నితీశ్ రాణా చెన్నై లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టడం హైలైట్. సునీల్ నరైన్ (7), రింకు సింగ్ (11) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో లుంగి ఎంగిడి 2 వికెట్లు, శాంట్నర్, జడేజా, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు.

Nithish Rana
KKR
CSK
Dubai
IPL 2020
  • Loading...

More Telugu News