CSK: ఐపీఎల్ 2020: కోల్ కతాపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ

CSK skipper MS Dhoni won the toss and elected bowling against KKR

  • నేడు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్
  • దుబాయ్ వేదికగా మ్యాచ్
  • చెన్నై జట్టులో మూడు మార్పులు 

ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే దారుణ పరాజయాలతో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన ధోనీ సేన తదుపరి మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఇతర జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు ప్రభావితమయ్యే అవకాశముంది.

ఇక, నేటి మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మూడు మార్పులు చేశారు. ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్, మోను స్థానంలో షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, కర్ణ్ శర్మ జట్టులోకి వచ్చారు.

మాంచి ఊపుమీదున్న కోల్ కతా జట్టులో ఒక మార్పు జరిగింది. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో రింకు సింగ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇంకా ఫిట్ నెస్ సంతరించుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News