Chiranjeevi: మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి!: నాగబాబుకు చిరంజీవి విషెస్

chiru wishes nagababu

  • నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు
  • అత్యంత విధేయుడు, ఎమోషనల్‌ పర్సన్‌
  • మంచి హృదయం, సరదాగా ఉండే వ్యక్తి

సినీ నటుడు నాగబాబు ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘అత్యంత విధేయుడు, ఎమోషనల్‌ పర్సన్‌, మంచి హృదయం, సరదాగా ఉండే నా సోదరుడు నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి  అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

చిరు తెలిపిన శుభాకాంక్షల పట్ల నాగబాబు రిప్లై ఇస్తూ.. ‘థ్యాంక్స్ అన్నయ్య... నేను ఎన్నటికీ నీతోనే ఉంటాను’ అని చెప్పారు. కాగా, నాగబాబుకి సాయితేజ్ ట్వీట్ చేస్తూ.. తనకు మద్దతుగా ఉండే వారిలో ఒకరు, తన బలం అయిన నాగబాబు మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ పేర్కొంటూ ఆయనతో చిన్నప్పుడు దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

Chiranjeevi
nagababu
  • Error fetching data: Network response was not ok

More Telugu News