Warangal District: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలో పడ్డ జీపు.. ముగ్గురి గల్లంతు

Jeep falls in well in Warangal district

  • సంగెం మండలం గవిచర్ల వద్ద ప్రమాదం
  • అదుపుతప్పి బావిలో పడ్డ జీపు
  • ముగ్గురి కోసం గాలిస్తున్న పోలీసులు

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఒక జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలో పడింది. ప్రమాద సమయంలో జీపులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 12 మందిని స్థానికులు కాపాడారు.  

 సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టి, మరో ముగ్గురి కోసం బావిలో గాలిస్తున్నారు. సంగెం మండలం గవిచర్ల వద్ద ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే జీపు అదుపుతప్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News