Stock Market: అమెరికా, యూరప్ దేశాల్లో మళ్లీ కరోనా... నష్టాల్లో ముగిసిన మన మార్కెట్లు!

Stock Markets ends with loses amidst corona fears
  • అంతర్జాతీయ స్థాయిలో సూచీలు పతనం
  • భారత మార్కెట్లపైనా ప్రభావం
  • నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
అమెరికా, యూరప్ దేశాల్లో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు మళ్లీ అధిక సంఖ్యలో వస్తున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడింది. అంతర్జాతీయ స్థాయిలో సూచీలు దిగువకు పడిపోయాయి. ఇదే ప్రభావం భారత మార్కెట్లలోనూ కనిపించింది. సెన్సెక్స్, నిఫ్టీ ఉదయం నుంచే పతనం దిశగా పయనించాయి. కరోనా కేసుల విజృంభణతో అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపారు. దాంతో గతవారం లాభాలన్నీ ఇవాళ్టి ట్రేడింగ్ లో ఆవిరయ్యాయి.

సెన్సెక్స్ 540 పాయింట్లు నష్టపోయి 40,145.50 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం అదే బాటలో నడిచింది. 152.30 పాయింట్ల నష్టంతో 11,778.05 వద్ద స్థిరపడింది. హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హిండాల్కో, ఎం అండ్ ఎం, జేఎస్ డబ్ల్యూ స్టీల్ తీవ్రంగా నష్టపోయాయి. హెచ్ డీఎఫ్ సీ లైఫ్, నెస్లే, కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి లాభాల బాటలో నడిచాయి.
Stock Market
NSE
BSE
Sensex
Nifty
Corona Virus
Pandemic
USA
Europe

More Telugu News