Chittoor District: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్బంధం.. వేకువజాము నుంచే ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు

Chittor police house arrests tdp leaders

  • హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరుకు నీళ్లివ్వాలని డిమాండ్
  • మహాపాద యాత్రలో పాల్గొనకుండా నేతలను అడ్డుకుంటున్న పోలీసులు
  • అవాంఛనీయ ఘటనలకు అస్కారం లేకుండానేనని వివరణ

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో టీడీపీ నేతలు చేపట్టిన మహాపాద యాత్రను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్ల వద్దకు వేకువజామునే చేరుకున్న పోలీసులు వారిని గృహ నిర్బంధం చేసి బయటకు రాకుండా చూస్తున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేసి చిత్తూరు జిల్లాకు నీటిని ఇవ్వాలన్న డిమాండ్‌తో టీడీపీ ఈ మహాపాద యాత్రను చేపట్టింది.

యాత్రలో పాల్గొనేందుకు రామకుప్పం నుంచి బయల్దేరిన మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు, కుప్పంలో ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులను అడ్డుకున్నారు. అలాగే, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన నేతలు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిలను కూడా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. పాదయాత్ర నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే నాయకులను అడ్డుకుంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Chittoor District
handri neeva project
TDP
Police
  • Loading...

More Telugu News