Yogi Adityanath: నవరాత్రుల ముగింపు సందర్భంగా కన్యాపూజను నిర్వహించిన యోగి 

Yogi Adityanath performs Kanyapooja

  • గోరక్షపీఠంలో యోగి పూజలు
  • తొమ్మిది మంది బాలికలకు పాదాలను కడిగిన సీఎం
  • ఉపవాస దీక్ష ముగింపు

దసరా నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హిందువులంతా కరోనా నిబంధనలను అనుసరిస్తూ వేడుకలను జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవరాత్రుల చివరిరోజున కన్యాపూజను నిర్వహించారు. గోరక్షపీఠానికి యోగి అధిపతిగా ఉన్న సంగతి తెలిసిందే. గోరఖ్ పూర్ లో ఉన్న పీఠంలో యోగి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ పీఠానికి న్యాయిక్ దండాధికారిగా యోగి వ్యవహరిస్తున్నారు. నాథ్ వర్గీయుల ఆచారాల ప్రకారం యోగి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్న సాయంత్రం శోభాయాత్రను నిర్వహించారు. తొమ్మిది మంది బాలికల పాదాలను కడిగి, పూజలు నిర్వహించారు. బాలికలకు దక్షిణ సమర్పించి, ఆహార పదార్థాలను అందించారు. అనంతరం తన ఉపవాసాలను ముగించారు.  

మహిళలను గౌరవిస్తూ, సంతాన ధర్మం కోసం ఈ కన్యాపూజను నిర్వహిస్తారని ఈ సందర్భంగా యోగి తెలిపారు. పండుగలు ప్రజల జీవితాల్లో సంతోషాన్ని తీసుకొస్తాయని చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని సూచించారు. విధిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని చెప్పారు.

.

  • Loading...

More Telugu News