Kajal Agarwal: హీరోయిన్ కాజల్ నిశ్చితార్థ ఉంగరం ఫొటోలు వైరల్!

kajal pic gors viral

  • గౌతమ్ కిచ్లూతో ఈ నెల 30న వివాహం 
  • చేతివేళ్లను చూపిస్తూ  వీడియో పోస్ట్‌
  • ఆమె చేతి వేలికి డైమండ్‌ రింగ్‌

ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ఈ నెల 30న వివాహం చేసుకోబోతున్నానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారి ఇళ్లలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా కాజల్ తన చేతివేళ్లను చూపిస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఇందులో ఆమె చేతి వేలికి డైమండ్‌ రింగ్‌ ఉంది.

కారులో వెళ్తున్న సమయంలో ప్రత్యేకంగా చేతి వేలికున్న ఉంగరాన్నే చూపెడుతూ తీసుకున్న ఫొటోను ఆమె పోస్ట్‌ చేయడం గమనార్హం. అది నిశ్చితార్థ ఉంగరమే అని స్పష్టమవుతోంది. ఇటీవల కిచ్లూ కూడా ఓ పోస్ట్‌ చేస్తూ వెడ్డింగ్‌ షాపింగ్ చేస్తున్నానని, తన వివాహ దుస్తులను ఏ డిజైనర్స్‌ సిద్ధం చేస్తున్నారనుకుంటున్నారని ఆయన అభిమానులను ప్రశ్నించారు. పెళ్లి తర్వాత వీరిద్దరు కొత్త ఇంట్లో కాపురం పెడతారు.

Kajal Agarwal
Tollywood
marriage
  • Loading...

More Telugu News