Jagan: రుణాలిచ్చే విషయంలో ఔదార్యం చూపండి: బ్యాంకర్లకు సీఎం జగన్ విజ్ఞప్తి

CM Jagan held meeting with bankers

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్ల సమావేశం
  • బ్యాంకర్లనుద్దేశించి ప్రసంగించిన సీఎం జగన్
  • కరోనా కాలంలో తోడ్పాటు అందించారంటూ బ్యాంకర్లకు అభినందన

తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ 212వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని, అన్ని పథకాలకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కోరారు. ముఖ్యంగా, రుణాలు ఇచ్చే విషయంలో ఔదార్యం చూపాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో నిధుల కొరత రానివ్వకుండా బ్యాంకులు అందించిన సహకారం అభినందనీయం అని పేర్కొన్నారు.

ఈ క్రమంలో తాము రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ బ్యాంకర్లకు వివరించారు. 2020-21 ఖరీఫ్ సీజన్ లో రూ.75,237 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్దేశించుకున్నామని, ఇప్పటిదాకా రూ.62,650 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. అటు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.1,110 కోట్ల పారిశ్రామిక రాయితీ అందించినట్టు వెల్లడించారు. మరెన్నో పథకాలకు బ్యాంకర్లు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ సూచించారు.

Jagan
Bankers
Tadepally
Camp Office
Andhra Pradesh
  • Loading...

More Telugu News