Rashmi Gautam: టీవీ యాంకర్ రష్మికి కరోనా పాజిటివ్!

Rashmi Gautam tests with Corona positive
  • అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్ చేయించుకున్న రష్మి 
  • ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం 
  • అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి 
ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. తెలుగు రాష్ట్రాల్లో రష్మికి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తాజాగా రష్మి కరోనా బారిన పడింది. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించింది.

ఈ నేపథ్యంలో ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రష్మి రద్దు చేసుకుంది. మరోవైపు రష్మి నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యాక్రమాల్లో పాల్గొంటున్న సమయంలోనే కరోనా సోకడంతో... ఆ కార్యక్రమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా కరోనా బారిన పడినట్టు ప్రచారం జరుగుతోంది.
Rashmi Gautam
Corona Virus
Tollywood

More Telugu News