Kapil Dev: క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కు గుండెపోటు!

Legendary cricketer Kapil Dev suffers heart attack

  • ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కపిల్ కు చికిత్స
  • యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న డాక్టర్లు

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గుండె పోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. 61 ఏళ్ల కపిల్ దేవ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కపిల్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.

తన కెరీర్లో కపిల్ మొత్తం 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5,248 పరుగులు, వన్డేల్లో 3,783 పరుగులు సాధించారు. ప్రపంచంలో టెస్ట్ కెరీర్లో 400 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా కపిల్ రికార్డు పుటల్లోకి ఎక్కారు. తన కెరీల్లో టెస్టుల్లో 434 వికెట్లు, వన్డేల్లో 253 వికెట్లను కపిల్ పడగొట్టారు. 1983 ప్రపంచ కప్ లో జింబాబ్వేపై 138 బంతుల్లో 175 పరుగులు (నాటౌట్) చేసి క్రికెట్ ప్రపంచాన్ని అబ్బుర పరిచారు. కెప్టెన్ గా ఇండియాకు ప్రపంచకప్ ను అందించారు.

  • Loading...

More Telugu News