Sharukh Khan: 18 దేశాలలో మళ్లీ విడుదలవుతున్న బాలీవుడ్ ప్రేమకథా చిత్రం!

DDLJ releasing in eighteen countries again now

  • 1995లో విడుదలైన 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే'
  • ఇండియాలో 89 కోట్లు, విదేశాలలో 14 కోట్లు వసూలు
  • ముంబై మరాఠా మందిర్ లో 20 ఏళ్లకు పైగా ప్రదర్శితం  

'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' (డీడీఎల్జే) చిత్రానికి బాలీవుడ్ సినిమాలలో ఓ ప్రత్యేకత వుంది. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా నటించిన ఈ ప్రేమకావ్యం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. 1995లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసును ఊపేసింది. నాలుగు కోట్ల బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రం ఇండియాలో 89 కోట్లు వసూలు చేయగా, విదేశాలలో 14 కోట్ల వరకు వసూలు చేసి అప్పట్లో పెద్ద రికార్డు కొట్టింది.

ఇక ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ లో బ్రేక్ అన్నది లేకుండా ఇరవై ఏళ్లకు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైందంటే దీనికి లభించిన ప్రేక్షకాదరణను మనం అర్థం చేసుకోవచ్చు. షారుఖ్, కాజోల్ ల స్టార్ డమ్ ను మరింత పెంచిన సినిమాగా దీనికి పేరుంది. ఇక ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడీ చిత్రాన్ని 18 దేశాల్లో మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. 

యూఎస్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, యూకే, కెనడా, సౌదీ అరేబియా, యూఏఈ, నార్వే, స్వీడెన్, ఫిజీ, మారిషస్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, ఫిన్లాండ్, ఖతార్, ఎస్టోనియా దేశాలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారని ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. వీటితో పాటు మరికొన్ని దేశాలలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Sharukh Khan
Kajol
DDLJ
  • Loading...

More Telugu News