Mulugu: ములుగు జిల్లాలో నాలుగు నెలల బాలుడి కిడ్నాప్.. పట్టుకున్న స్థానికులు

four month boy kidnapped in mulugu dist

  • ములుగు జిల్లా వెంకటాపురంలో ఘటన
  • కిడ్నాపర్లను వెంటాడి పట్టుకున్న స్థానికులు
  • దత్తత ఇచ్చిన వారే కిడ్నాప్ చేశారంటూ మహిళ ఫిర్యాదు

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో నాలుగు నెలల బాబును కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కిడ్నాప్ గురించి తెలిసిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు కిడ్నాపర్ల వాహనాన్ని చేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం కిడ్నాపర్లను, బాలుడుని, వారి వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్నేహ-మహేందర్ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే ఏడు నెలల గర్భిణిగా ఉన్న స్నేహ నాలుగు నెలల క్రితం నాగేశ్వరి అనే మహిళను ఆశ్రయించడంతో ఆమె కాన్పు చేసింది. అయితే, పుట్టిన బిడ్డను వద్దనడంతో నాగేశ్వరి ఆ బాలుడిని దత్తత తీసుకుంది. బాలుడి తల్లిదండ్రులే ఇప్పుడీ కిడ్నాప్‌నకు పాల్పడినట్టు నాగేశ్వరి ఆరోపిస్తోంది. అర్ధరాత్రి తనపై దాడిచేసి, కళ్లలో కారం చల్లి బాలుడిని ఎత్తుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Mulugu
venkatapur
kidnap
boy
  • Error fetching data: Network response was not ok

More Telugu News