RBI: కొత్తగా క్యూఆర్ కోడ్ లను సృష్టించడాన్ని నిషేధించిన ఆర్బీఐ!

RBI Bans New QR Codes of UPIs

  • వాడుకలో ఉన్న కోడ్ లనే వాడాలి
  • చెల్లింపులకు భారత్, యూపీఐ కోడ్ లు
  • మార్చి 31లోగా మారిపోవాలన్న ఆర్బీఐ

డిజిటల్ చెల్లింపుల కోసం పీఎస్ఓ (పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు) మరిన్ని సొంత క్యూఆర్ కోడ్ లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. ఇప్పుడు వాడుకలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్‌ క్యూఆర్‌ కోడ్ ‌లను మాత్రమే కొనసాగించేందుకు అనుమతి ఉంటుందని ఆర్బీఐ తాజాగా ఆదేశించింది.

సొంత క్యూఆర్‌ కోడ్‌ లు వాడుకుంటున్న పీఎస్ఓ సంస్థలు ఈ రెండింటికీ మారాలని పేర్కొంది. మార్చి 31లోగా అన్ని పీఎస్ఓలూ యూపీఐ, భారత్ కోడ్ లను మాత్రమే వాడాలని ఆదేశించింది. కాగా, 1990లో జపాన్ కు చెందిన ఓ సంస్థ క్యూఆర్ కోడ్ విధానాన్ని తయారు చేయగా, ప్రస్తుతం ఇండియాలో భారత్, యూపీఐ క్యూఆర్ లతో పాటు పలు సంస్థలు సొంత కోడ్ లను వాడుతున్నాయి.

  • Loading...

More Telugu News