shikar dhavan: క్రికెటర్ శిఖర్ ధావన్ భావోద్వేగభరిత పోస్ట్!

shikar dhavan posts about his carees

  • టీమిండియా జెర్సీ వేసుకొని నేటికి పదేళ్లు
  • దేశం కోసం ఆడుతున్నా
  • ఇంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు

భారత క్రికెటర్ శిఖర్ ధావన్ భావోద్వేగభరిత పోస్ట్ చేశాడు. ఆయన టీమిండియా జెర్సీ వేసుకొని నిన్నటికి పదేళ్లయింది. ఆయన 2010, అక్టోబర్‌ 20న భారత వన్డే జట్టులోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ... టీమిండియాతో పదేళ్లు గడిపానని, దేశం కోసం ఆడుతున్నానని అన్నాడు. ఇంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదని, మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం తన జీవితానికి సరిపోయే జ్ఞాపకాలను ఇచ్చిందని చెప్పాడు.

అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శిఖర్ ధావన్‌ పేర్కొన్నాడు. కాగా, నిన్న ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 164 పరుగులు చేయగా, వాటిలో 106 పరుగులు శిఖర్ ధావనే చేసిన విషయం తెలిసిందే. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఆయన గతంలో టీమిండియాను చాలా సార్లు‌ గెలిపించాడు.

shikar dhavan
Cricket
IPL 2020
  • Loading...

More Telugu News