Pawan Kalyan: వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం
- కోటి రూపాయల విరాళం ప్రకటించిన పవన్
- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు భేష్ అని కితాబు
- టౌన్ ప్లానింగ్ విభాగం ఫెయిల్యూర్ వల్లే విపత్తు అని విమర్శ
భారీ వర్షాలు, వరదలతో భాగ్యనగరం బెంబేలెత్తిపోయింది. ఇళ్లు నీట మునగడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నిత్యావసర సరుకులు కూడా వరద నీటిలో ముగినిగిపోవడంతో పలువురు ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వరద బాధితుల సహాయార్థం జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని మొత్తం రంగంలోకి దించింది.
నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించింది. ఎవరికీ ఆహారం, మందుల కొరత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు వరదబాధితులను ఆదుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సినీ ప్రముఖులు భారీ ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా బాధితుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వానికి రూ. 1 కోటి విరాళాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా పవన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పునరావాస చర్యలను పవన్ ప్రశంసించారు. గత కొన్నేళ్లుగా టౌన్ ప్లానింగ్ విభాగం ఫెయిల్ అయిన నేపథ్యంలోనే... ఇప్పుడు ఈ స్థాయిలో విపత్తు సంభవించిందని అన్నారు.