Babri Masjid: బాబ్రీ కూల్చివేతపై ప్రతీకారం తీర్చుకుందాం.. భారత్ పై జీహాద్ ప్రకటించండి: ఐసిస్

Islamic State calls to avenge Babri demolition
  • దేశంలో ఒక వర్గాన్ని రెచ్చగొడుతున్న ఐసిస్
  • భారత ప్రభుత్వంపై పోరాడాలని పిలుపు
  • సీఏఏ నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగించాలని సూచన
భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రసంస్థ ఐసిస్ చేపట్టిన కుట్ర బహిర్గతమైంది. భారత్ కు, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయుధాలు ధరించి, జీహాద్ ప్రకటించాలని ఒక వర్గాన్ని ఉద్దేశించి ఐసిస్ పిలుపునిచ్చింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎగదోస్తోంది.

సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను కూడా కొనసాగించాలని సూచించింది. భారత ప్రభుత్వంపై పోరాటంలో ఇది కూడా ఒక భాగమని తెలిపింది. రహస్య వెబ్ సైట్లు, టెలిగ్రామ్ చానళ్ల ద్వారా ఈ మేరకు విద్వేషపూరిత భావజాలాన్ని ఐసిస్ ఒక వర్గం ప్రజలకు ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని ఐసిస్ డిజిటల్ పత్రిక 'వాయిస్ ఆఫ్ హింద్'లో ప్రచురించారు.   
Babri Masjid
ISIS
CAA

More Telugu News