Varalakshmi: దర్శకురాలిగా మారిన కథానాయిక వరలక్ష్మి!

Varalakshmi turned director

  • విభిన్న తరహా పాత్రలు పోషించే వరలక్ష్మి 
  • 'కన్నామూచి' సినిమాకు దర్శకత్వం
  • మహిళల సమస్యల ప్రధానంగా కథ
  • సహనటుల శుభాకాంక్షల వెల్లువ     

కథానాయికలు నిర్మాతలుగా మారడం అన్నది అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అయితే, దర్శకత్వంలోకి ప్రవేశించే కథానాయికలు మాత్రం అరుదనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి ప్రయత్నాన్ని తమిళ, తెలుగు నటి వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తోంది. మొదటి నుంచీ విభిన్న తరహా పాత్రలు పోషిస్తూ, చక్కని నటిగా పేరుతెచ్చుకున్న వరలక్ష్మి అప్పుడప్పుడు విలనీ తరహా పాత్రలు కూడా చేసి, మెప్పిస్తూ వుంటుంది. ఇప్పుడీ భామ దర్శకురాలిగా మారుతున్నట్టు స్వయంగా ప్రకటించింది.

వరలక్ష్మి దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం పేరు 'కన్నామూచి'. ఇందులో తాను కూడా నటిస్తున్నట్టు ఆమె పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఆఖరికి దర్శకురాలిగా మారాను. చక్కని చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తాను' అని ఆమె తెలిపింది. నేటి సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను,. మహిళలపై దాడులను ఈ చిత్రంలో ఆమె చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఇక వరలక్ష్మి దర్శకురాలిగా మారుతున్నట్టు తెలియగానే సహా నటులు, చిత్ర ప్రముఖులు ఆమెను శుభాకాంక్షలతో ముంచెత్తారు. వరలక్ష్మిని చూస్తుంటే గర్వంగా, సంతోషంగా ఉందనీ, ఆమె చక్కని చిత్రాన్ని తీసి, సక్సెస్ అవ్వాలని వారంతా తమ ట్వీట్ల ద్వారా ఆకాంక్షించారు.

Varalakshmi
Director
first look
  • Loading...

More Telugu News