Corona Virus: కరోనా సోకితే వినికిడి సమస్యలు.. పరిశోధనలో కొత్త విషయం వెల్లడి

side effects with russia vaccine

  • యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకుల అధ్యయనం
  • పాక్షికంగా లేక పూర్తిగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం
  • అరుదైన సందర్భాల్లో జరిగే అవకాశం

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి పరిశోధకులు చేస్తోన్న అధ్యయనంలో భాగంగా అనేక కొత్త విషయాలు తెలుస్తున్నాయి. శరీరంలోకి కరోనా ప్రవేశిస్తే అనేక శరీర భాగాలు పాడయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు ఇప్పటికే గుర్తించారు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, క్లోమం, కాలేయంపై కరోనా ప్రభావం చూపుతుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. యువతలోనూ ఈ అవయవాలు పాడయ్యే అవకాశం ఉంది.

యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనంలో మరో కొత్త విషయం తెలిసింది.  చెవులు కూడా వైరస్‌ ప్రభావానికి గురవుతాయని, దీంతో పాక్షికంగా లేక పూర్తిగా వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ వివరాలను బీఎంజే కేస్‌ రిపోర్ట్‌ జర్నల్‌లో ప్రచురించారు.

  • Loading...

More Telugu News