Bigg Boss Telugu 4: మాస్టర్ పై పగ తీర్చుకుంటూ... బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కుమార్ సాయి!

Big Bomb on Master by Kumar Sai

  • ముందుగానే ఊహించిన లీక్ వీరులు
  • వారం రోజులు వాష్ రూముల డ్యూటీ అమ్మ రాజశేఖర్ కు
  • కోరికను తీర్చుకున్న కుమార్ సాయి

టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 4లో లీక్ వీరులు ఊహించినట్టుగానే కుమార్ సాయి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే, ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను హోస్ట్ నాగార్జున ఇంకాస్త సస్పెన్స్ తో రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. మోనాల్, కుమార్ సాయిలను బట్టలు సర్దుకోవాలని చెప్పి, ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ కు పిలిపించి, ఆపై కుమార్ ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఆపై తనకు కథ చెప్పే అవకాశాన్ని కుమార్ సాయికి ఇస్తున్నట్టు నాగ్ ప్రకటించారు.

ఇక కుమార్ సాయి బయటకు వెళుతుంటే, మిగతా కంటెస్టెంట్లు పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. దీంతో ఆయనకు హౌస్ నుంచి ఘనమైన వీడ్కోలు ఏమీ లభించలేదు. ఆపై హౌస్ నుంచి బయటపడి, స్టేజ్ పైకి వచ్చిన కుమార్ సాయి. ఒక్కో ఇంటి సభ్యుడినీ ఒక్కో కూరగాయతో పోల్చాడు. మొదటి నుంచి తాను వ్యతిరేకిస్తున్న అమ్మ రాజశేఖర్ పై బిగ్ బాంబ్ వేసి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు.

దీంతో రానున్న వారమంతా బాత్ రూములను క్లీన్ చేయాల్సిన పని మాస్టర్ పై పడింది. నాగ్ కోరిక మేరకు ఓ పాటకు డ్యాన్స్ చేసిన కుమార్ సాయి, హౌస్ నుంచి బయటకు వచ్చినా, తన కోరికను తీర్చుకోనున్నానన్న ఆనందంలో వెళ్లిపోయాడు. తనకు స్టోరీ వినిపించేందుకు నాగ్ అంగీకరించడంతో కుమార్ సాయి ఆనందానికి అంతు లేకుండా పోయింది.

Bigg Boss Telugu 4
Master
Amma Rajashekhar
Kumar Sai
Elimination
  • Loading...

More Telugu News