Tungabhadra: తుంగభద్రకు తగ్గిన వరద ఉద్ధృతి.. 33 గేట్లు మూసివేత
- జలాశయానికి తగ్గిన వరద ఉద్ధృతి
- పూర్తిస్థాయికి చేరుకున్న నీటిమట్టం
- ఇన్‌ఫ్లో 13,399.. అవుట్ ఫ్లో 13,400 క్యూసెక్కులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఇటీవల తుంగభద్ర జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో అధికారులు 33 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే, ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో తెరిచిన గేట్లను అధికారులు తిరిగి మూసివేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయికి చేరుకుంది. నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 100 టీఎంసీలుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే, ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 13,399 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 13,400 క్యూసెక్కులుగా ఉన్నట్టు డ్యామ్ అధికారులు తెలిపారు.