Aarogya Setu App: 'ఆరోగ్యసేతు' యాప్ భేష్ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

WHO lauds Aarogya Setu app

  • కరోనాను ట్రేస్ చేసే యాప్ లలో ఇదే పెద్దది
  • ఇప్పటి వరకు 15 కోట్ల డౌన్ లోడ్లు
  • కరోనా నియంత్రణలో అద్భుతంగా పని చేస్తోందని డబ్ల్యూహెచ్ఓ కితాబు

కరోనా మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఆరోగ్యసేతు' యాప్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో ఈ యాప్ అద్భుతంగా పని చేస్తోందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రెయోసెస్ కితాబునిచ్చారు.

ఈస్టర్న్ మెడిటరేనియన్ రీజనల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కేసులను ట్రేస్ చేసే యాప్ లలో అన్నింటికన్న పెద్దది ఆరోగ్యసేతు అని చెప్పారు. దాదాపు 15 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు.

కరోనా కేసులను గుర్తించడంలో ఈ యాప్ కీలకపాత్ర పోషిస్తోందని... దీనివల్ల ఏయే ప్రాంతాల్లో కరోనా టెస్టులను ఎక్కువగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడానికి ఆరోగ్య శాఖకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. కరోనా పాజిటివ్ వ్యక్తులు మన సమీపంలోకి వచ్చినప్పుడు బ్లూటూత్ ద్వారా ఈ యాప్ అప్రమత్తం చేస్తుంది. దీంతో పాటు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం తెలుకోవచ్చు.

Aarogya Setu App
WHO
Corona Virus
  • Loading...

More Telugu News