Hathras: కేసు విచారణకు హత్రాస్ వచ్చిన సీబీఐ అధికారులు.. ఫొటోలు తీసిన స్థానికులు.. వీడియో ఇదిగో

CBI team reaches Hathras

  • దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన హత్రాస్ హత్యాచారం కేసు
  • విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగింత
  • విచారణ ప్రారంభించిన సీబీఐ

దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ హత్యాచారం కేసులో విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే నిందితులపై వివిధ సెక్షన్ల కింద సామూహిక అత్యాచారం, హత్యాయత్నం, హత్య కేసులను సీబీఐ నమోదు చేసింది.

ఈ విషయంపై స్థానిక ఎస్పీతోనూ చర్చించింది. ఈ కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలను సీబీఐ బృందం తీసుకుంది. ఈ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు తొలిసారి ఈ రోజు హత్రాస్ కు వచ్చారు. అక్కడ విచారణ జరిపి ఆధారాలను సేకరించనున్నారు. సీబీఐ అధికారులు కార్లలో తమ ప్రాంతానికి వస్తోన్న నేపథ్యంలో స్థానికులు తమ స్మార్ట్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News