Mulugu: టీఆర్ఎస్ నేతను తుపాకితో కాల్చి చంపిన మావోలు!

Maoists Murder TRS Leader

  • ములుగు జిల్లాలో దారుణం
  • భీమేశ్వరరావు ఇంట్లోకి చొరబడిన ఆరుగురు మావోలు
  • ఉనికి కోసమే హత్య చేశారన్న పోలీసులు

తెలంగాణ పరిధిలోని ములుగు జిల్లా, వెంకటాపురం మండలం అలుబాక సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.స్థానిక టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును దారుణంగా కాల్చి చంపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భీమేశ్వరరావు ఇంట్లోకి జొరబడిన ఆరుగురు మావోయిస్టులు, ఆయన్ను తొలుత బయటకు లాక్కొచ్చారు.

ఆపై అదే ప్రాంతంలో కత్తితో పొడిచి, తుపాకితో కాల్చి హత్య చేశారు. భీమేశ్వరరావుకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెళ్లిపోయే వేళ, మావోలు ఓ లేఖను వదిలి వెళ్లారు. ఇటీవలి కాలంలో ములుగు పరిధిలో మావోల ఏరివేత దిశగా కూంబింగ్ ను పోలీసులు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ ఉనికిని తెలిపేందుకు మావోలు ఈ హత్యకు పాల్పడి వుంటారని పోలీసులు భావిస్తున్నారు.


Mulugu
Maoists
TRS Leader
Murder
  • Loading...

More Telugu News