Richa Gangopadhyay: ప్రకృతి ఒడిలో భర్తతో... ఫొటో పంచుకున్న రిచా గంగోపాధ్యాయ్

Former actress Richa Gangopadhyay shares photo

  • కొంతకాలం కిందట అమెరికన్ ను పెళ్లి చేసుకున్న రిచా
  • సినిమాలకు ఎప్పుడో దూరం
  • అమెరికాలోనే సెటిలైన నటి

అందాలభామ రిచా గంగోపాధ్యాయ్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను పలకరించారు. తన అమెరికన్ బాయ్ ఫ్రెండ్ జో లాంగెల్లాను వివాహమాడిన రిచా చాన్నాళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉంటున్నారు. సినిమాల్లో స్టార్ డమ్ అనుభవిస్తున్న దశలోనే ఆమె ఉన్నత చదువుల పేరిట అమెరికా వెళ్లిపోయారు. అక్కడే పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఈ నేపథ్యంలో, భర్త జో లాంగెల్లాతో కలిసి ప్రకృతి మాత ఒడిలో విహరిస్తున్న ఓ ఫొటోను రిచా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

"ఓ నాస్తికవాద ఇండో-అమెరికన్ మహిళగా, వలసవాదిగా... నాస్తికుడైన కాకేసియన్ అమెరికన్ సంతతికి చెందిన అమెరికా మాజీ సైనికుడ్ని పెళ్లాడాను. ఈ వివాహం చేసుకున్న సమయంలో ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. నాపై తమ అభిప్రాయాలు రుద్దేందుకు ప్రయత్నించారు. కానీ మా అనుబంధం పెళ్లి వరకు వెళ్లిందంటే అందుకు కారణం జాతి, మతం, నేపథ్యం ఏమీ చూసుకోలేదు కాబట్టి. మేం ప్రాథమిక విలువలకు కట్టుబడి ఉంటాం కాబట్టి మాది అనుకూల దాంపత్యం అని చెప్పగలను. ఎందుకంటే మేం పోరాడతాం... కానీ కలిసుండేందుకు, విడిపోయేందుకు కాదు" అంటూ తన మనసులోని భావాలను రిచా పంచుకున్నారు.

Richa Gangopadhyay
Joe Langella
Marriage
USA
Tollywood
  • Loading...

More Telugu News