Rajamouli: మీ అందరి ప్రేమాభిమానాలకు ముగ్ధుడ్నయ్యాను: రాజమౌళి

Rajamouli thanked to all who wished him on Birthday
  • నేడు రాజమౌళి పుట్టినరోజు
  • వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • వినమ్రంగా శుభాకాంక్షలు తెలిపిన జక్కన్న
టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన నేటితో 47వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ ప్రముఖులు, అభిమానులు జక్కన్నను విషెస్ జడివానలో తడిపేశారు. ఈ క్రమంలో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశారు. మీ అందరి ప్రేమాభిమానాలకు ముగ్ధుడ్ని అయ్యాను అంటూ వినమ్రంగా స్పందించారు. మీ శుభాకాంక్షలే దీవెనలుగా భావిస్తాను అంటూ ట్వీట్ చేశారు.

రాజమౌళి 1973 అక్టోబరు 10న జన్మించారు. రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల రాజమౌళి. సినీ దర్శకత్వం చేపట్టడానికి ముందు ఆయన టెలివిజన్ సీరియళ్లకు దర్శకత్వం వహించేవారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్ద శిష్యరికం చేసిన ఆయన స్టూడెంట్ నెం.1 చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ్నించి వెనుదిరిగి చూసుకున్నది లేదు.

సింహాద్రి, సై, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి చిత్రాలు... ఇలా ఆయన ఖ్యాతి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంపై భారీ హైప్ నెలకొన్నదంటే అందుకు కారణం రాజమౌళి ఛరిష్మానే. రాజమౌళి ఇంతవరకు ఫ్లాప్ ఎలా ఉంటుందో తెలియకుండా అప్రతిహత ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆయన 19 ఏళ్ల దర్శకత్వ ప్రస్థానంలో అన్నీ విజయాలే.
Rajamouli
Birthday
Wishes
Director
Tollywood

More Telugu News