Jagan: చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న ఎమ్మెల్యే భూమనకు జగన్‌ ఫోన్

jagan calls bhoomana

  • భూమనకు రెండోసారి సోకిన కరోనా 
  • ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న జగన్
  • ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన

వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండో సారి కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

మరోసారి కరోనా సోకిన నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఇకపై ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రెండు నెలల క్రితం కరోనా నుంచి కోలుకున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలో ఇటీవల మరోసారి ఆ వైరస్ లక్షణాలు కనపడ్డాయి. మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

Jagan
Bhumana Karunakar Reddy
YSRCP
Corona Virus
COVID19
  • Loading...

More Telugu News