Devineni Uma: విశాఖలో బయటపడ్డ మరో భారీ భూకబ్జా బాగోతం: దేవినేని ఉమ

devineni uma slams jagan

  • అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు
  • అసలు పేరు మార్చి.. ఏమార్చారు
  • వందల కోట్ల రూపాయల భూమి కొట్టేశారు
  • కుటుంబ సభ్యుల పేర ప్రజాప్రతినిధి రిజిస్ట్రేషన్

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘పేరు మార్చి.. ఏమార్చి.. కబ్జా’ పేరిట విశాఖ‌లో జరిగిన భూభాగోతం ఆరోపణలపై ‘ఆంధ్ర‌జ్యోతి’ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని ఆయ‌న పోస్ట్ చేశారు.

‘విశాఖలో బయటపడ్డ మరో భారీ భూకబ్జా బాగోతం.. అధికార పార్టీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు.. అసలు పేరు మార్చి.. ఏమార్చి వందల కోట్ల రూపాయల భూమి కుటుంబ సభ్యుల పేర రిజిస్ట్రేషన్, సెటిల్ చేసుకోవాలంటూ బెదిరింపులు. విశాఖలో వరుస భూబాగోతాలపై, మీ ప్రజాప్రతినిధిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని దేవినేని ఉమ నిలదీశారు.

కాగా, విశాఖలో మరో భూ బాగోతం బయటపడిందని, వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై ఫిర్యాదు వచ్చిందని ఆంధ్రజ్యోతి దినపత్రికలో పేర్కొన్నారు. 60 ఏళ్ల కిందట చిరుద్యోగికి ఐదెకరాలు ఇచ్చారని, అయితే, మరో వ్యక్తి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించి, కన్నబాబు రాజు కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అందులో చెప్పారు. దీంతో అసలు వారసుడు న్యాయ పోరాటం చేస్తున్నాడని,  భూమి ఎమ్మెల్యే అధీనంలోనే ఉందని చెప్పారు. తాజాగా విచారణకు కలెక్టర్‌ ఆదేశించారని అందులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News