Pooja Hegde: 'రాధే శ్యామ్' కోసం ఇటలీ వెళ్లిన పూజ హెగ్డే!

Pooja Hegde joins Radhe Shyam shoot

  • ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' 
  • లాక్ డౌన్ కి ముందు జార్జియాలో షూట్ 
  • సహజత్వం కోసం ఇటలీ వెళ్లిన యూనిట్
  • హీరో హీరోయిన్లపై సన్నివేశాల చిత్రీకరణ  

ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందు జార్జియాలో ఎక్కువ భాగం జరిగింది. అయితే, లాక్ డౌన్ కారణంగా బ్రేక్ రావడంతో ఆరు నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది. దాంతో ఇటలీలో చేయాల్సిన ఇతర షూటింగ్ భాగాన్ని హైదరాబాదులోనే సెట్స్ వేసి చేద్దామని దర్శక నిర్మాతలు భావించి, సెట్స్ కూడా వేశారు.

అయితే, ఇప్పుడు యూరప్ లో కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడడంతో సహజత్వం కోసం అక్కడికే వెళ్లి షూటింగ్ చేయాలని నిర్ణయించి యూనిట్ ఇటీవల ఇటలీకి వెళ్లింది. హీరో ప్రభాస్ కూడా వెళ్లడంతో గత కొన్ని రోజులుగా అక్కడ ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు కథానాయిక పూజ హెగ్డే కూడా ఇటలీ వెళ్లి షూటింగులో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో మరికొన్ని రోజుల పాటు ఇటలీలో వీరిద్దరిపై కొన్ని సన్నివేశాలను, పాటలను అక్కడ చిత్రీకరిస్తారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నందున హిందీ వెర్షన్ ని కూడా విడుదల చేస్తారు.   

Pooja Hegde
Prabhas
Radhe Shyam
Italy
  • Loading...

More Telugu News