Yash: కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ స్టార్ట్... ఇడుగో యశ్!

Hero Yash joins KGF Chapter two shooting today

  • మళ్లీ ఊపందుకుంటున్న చిత్రీకరణలు
  • సముద్రతీరంలో కేజీఎఫ్ సీక్వెల్ షూటింగ్
  • రాఖీ ప్రయాణం మొదలైందన్న యశ్

పాన్ ఇండియా సినిమాల్లో కేజీఎఫ్ సృష్టించిన సంచలనం మామూలుగా లేదు. గతంలో ఏ కన్నడ చిత్రం సాధించని రీతిలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లోనూ కేజీఎఫ్ విజయదుందుభి మోగించింది. ఈ చిత్రంలో రాఖీ పాత్ర పోషించిన హీరో యశ్ పాప్యులారిటీ కన్నడ చిత్రసీమ సరిహద్దులు దాటి దేశవ్యాప్తం అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టయినర్ బాక్సాఫీసు హిట్ కావడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 పేరిట దీనికి సీక్వెల్ కూడా తీస్తున్నారు.

కరోనా వ్యాప్తితో ఇన్నాళ్లు నిలిచిపోయిన కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో మళ్లీ షురూ అయింది. ఇవాళే హీరో యశ్ కూడా సెట్స్ పైకి వచ్చారు. సముద్ర తీరప్రాంతంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల్లో పాల్గొన్నారు. మరోసారి రాకింగ్ లుక్స్ తో యశ్ కనువిందు చేస్తున్న ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ఫొటోను యశ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసి, అలలను మనం ఆపలేకపోవచ్చు కానీ సముద్రయానం ఎలా చేయాలో నేర్చుకోవచ్చు... ఇవాళ్టి నుంచి రాఖీ ప్రస్థానం సాగిస్తున్నాడు అంటూ కామెంట్ చేశారు.

Yash
KGF Chapter-2
Shooting
Sets
Racky
  • Loading...

More Telugu News