Kotagiri Sridhar: కరోనా బారినపడిన ఏలూరు ఎంపీ

Eluru MP Kotagiri Sridhar tested corona positive
  • ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా పాజిటివ్
  • ఆయన కార్యాలయంలో నలుగురు సిబ్బందికీ అదే రిజల్ట్
  • తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలన్న ఎంపీ
ఏపీలో కరోనా బారినపడుతున్న ప్రజాప్రతినిధుల జాబితాలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా చేరారు. కోటగిరి శ్రీధర్ కు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఆయన కార్యాలయంలో మరో నలుగురు ఉద్యోగులకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

ఈ నేపథ్యంలో, గత వారం రోజులుగా తనను కలిసిన వాళ్లు ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోటగిరి శ్రీధర్ సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులో హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

నిత్యం జనం మధ్య తిరిగే ప్రజాప్రతినిధులు, నేతలపై కరోనా వైరస్ తన ప్రభావం చూపుతోంది. ఏపీలో మాణిక్యాలరావు, బల్లి దుర్గాప్రసాద్ వంటి రాజకీయప్రముఖులు సైతం ఈ మహమ్మారికి బలవడం విషాదకరం.
Kotagiri Sridhar
Corona Virus
Positive
Eluru
MP
Isolation

More Telugu News