Kajal Agarwal: కాబోయే భర్త గౌతమ్‌, ఆడపడుచుతో హీరోయిన్ కాజల్ ఫొటో వైరల్!

kajal pic viral

  • ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూతో వివాహం 
  • కాబోయే భర్త గౌతమ్‌ కిచ్లు సోదరి గౌరి కిచ్లు నాయర్‌
  • కాజల్‌కు గౌరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు
  • ఇన్‌స్టా స్టోరీ పెట్టుకున్న కాజల్

ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని, తమ దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుందని హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు గౌతమ్‌ కిచ్లూ సోదరి గౌరి కిచ్లూ నాయర్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కాజల్, గౌతమ్‌లతో తాను ఇటీవల దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

  ఆమె చేసిన పోస్టును చూసిన కాజల్ కూడా స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, ఈ ఫొటోను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీగా పెట్టుకుంది. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆ ఫొటోను స్క్రీన్ షాట్లు తీసుకుని పెట్టుకున్నారు. కాజల్ గృహిణి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Kajal Agarwal
Tollywood
Viral Pics
  • Loading...

More Telugu News