Jagan: కేంద్ర మంత్రికి లేఖ రూపంలో 'నీటి' వివరాలు సమర్పించిన సీఎం జగన్
- రాయలసీమకు శ్రీశైలం నీరే ఆధారం
- తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శ్రీశైలంపైనే ఆధారపడ్డాం
- థార్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడిన విషయం తెలిసిందే. అనంతరం షెకావత్‌కు జగన్ ఓ లేఖ అందించారు. అందులోని వివరాలు మీడియాకు చేరాయి.
దుర్భిక్షమైన రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశంకు శ్రీశైలం నీరే ఆధారమని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, గాలేరు-నగరి శ్రీశైలంపైనే ఆ జిల్లాలు ఆధారపడ్డాయని తెలిపారు. అంతేగాక, సోమశిల, కండలేరు, వెలిగొండ, హంద్రీనీవా, చిత్రావతికి కూడా శ్రీశైలమే ఆధారమని వివరించారు.
తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శ్రీశైలంపైనే ఆధారపడ్డామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాజెక్టులు అన్నీ శ్రీశైలంపేనే ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. థార్ ఎడారి తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం అనంతపురం జిల్లాలో పడుతుందని చెప్పారు. ఏపీకి కేటాయించాల్సిన నీరు ఇవ్వాల్సిందేనని కోరారు.