Chandrababu: పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు లేఖ ఉంది: డీఐజీ పాలరాజు

DIG Palaraju comments on Chandrababu

  • ఎన్సీఆర్బీలో పొరపాట్లను అందరూ గుర్తించారు
  • చంద్రబాబు మాత్రమే గుర్తించలేదు
  • చంద్రబాబు విజ్ఞతతో ఆలోచించాలి

రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలపై ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై డీఐజీ పాలరాజు స్పందించారు. చంద్రబాబు రాసిన లేఖ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు.

నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో (ఎన్సీఆర్బీ)లో పొరపాట్లను అందరూ గుర్తించారని... చంద్రబాబు మాత్రమే గుర్తించలేదని చెప్పారు. చంద్రబాబు విజ్ఞతతో ఆలోచించాలని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఎంతో అప్రమత్తంగా పని చేస్తున్నారని... ఈ విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తించాలని అన్నారు. టీడీపీ నాయకుడు పట్టాభి కారుపై దాడి చేసిన దుండగులను పట్టుకుంటామని చెప్పారు. పట్టాభి ఇంట్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలిపారు.

Chandrababu
Telugudesam
DIG Palaraju
  • Loading...

More Telugu News