Corona Virus: మధుమేహం ఉన్నవారికి కరోనాతో ముప్పు అధికం!

 potential complications of diabetes if tests corona positive

  • మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో రోగనిరోధక శక్తి తక్కువ
  • కరోనా సోకితే పాంక్రియాటైటిస్‌ కూడా తలెత్తే అవకాశం
  • మధుమేహం స్థాయి పెరిగే ఛాన్స్

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో జరుపుతోన్న పరిశోధనల్లో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. హైకోర్టుకు తాజాగా ఢిల్లీ సర్కారు సమర్పించిన సీరోలాజికల్‌ సర్వైలెన్స్‌ నివేదిక ద్వారా మరో విషయం తెలిసింది. కొవిడ్-9‌ సోకిన మధుమేహ బాధితులకు ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని చెప్పారు. కొన్ని మందులను ఆపేయడం వల్ల ఈ పరిస్థితి వస్తుందని అన్నారు. ఊపిరితిత్తులతో పాటు క్లోమంపై కొవిడ్‌-19 ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మధుమేహం ఉన్నవారికి కరోనా సోకితే పాంక్రియాటైటిస్‌ కూడా తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పారు. పాంక్రియాస్ ఇన్సులిన్‌ను విడుదల చేస్తుందనీ, తద్వారా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తుందని తెలిపారు. కరోనా సోకితే ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గుతుందన్నారు.

దీంతో కొందరు మొదటిసారిగా మధుమేహం బారిన కూడా పడుతున్నారని తెలిపారు. దేశంలోని మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో చాలా మందికి ఊబకాయం వంటి ఇతర సమస్యలు ఉంటున్నాయని చెప్పారు. కరోనా సోకితే బరువు తగ్గించడం, శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఉద్దేశించిన ఎస్‌జీఎల్‌టీ2 ఇన్‌హిబిటర్లు, ఇతర ఔషధాలను ఇవ్వడం కుదరక పోవడంతో వారిలో మధుమేహం స్థాయి పెరుగుతుందని వివరించారు. కరోనా వైరస్‌ కారణంగా ఒత్తిడి పెరుగుతుండని, దీంతో చక్కెర స్థాయి కూడా అధికమవుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News