Nusrut Jahaan: బెంగాలీ నటి, ఎంపీ నుస్రత్ కు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్న ఫొటో ఇదే!

Sleepless Nights for MP Nusrut Jahaan
  • ప్రస్తుతం లండన్ లో ఉన్న నుస్రత్
  • ఇటీవల దుర్గామాత గెటప్ లో ఫొటో
  • చంపేస్తామంటూ బెదిరింపులు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, గత సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించిన నటి నుస్రత్ జహాన్ కు ఇప్పుడు ఓ ఫొటో నిద్రలేని రాత్రులను మిగులుస్తోంది. జన్మతః ముస్లిమే అయినా, తనకు కులమతాలు లేవని చెప్పే నుస్రత్, ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం లండన్ లో ఉన్నారు. లండన్ కు బయలుదేరే ముందు ఆమె తన సామాజిక మాధ్యమాల్లో కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. వాటిల్లో ఒకటి దుర్గామాతలా, చేతిలో త్రిశూలం పట్టుకున్న చిత్రం ఉంది.

ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ కాగా, వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి. వీటిల్లో అత్యధికం బంగ్లాదేశ్ ముస్లిం ఛాందసవాదుల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. నుస్రత్ జీవితానికి ముగింపు సమీపించిందని, ఆమె చేస్తున్న తప్పులు మరణం తరువాతే తెలుస్తాయన్న హెచ్చరికలతో కామెంట్లు వచ్చాయి.

ఇక చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ కావడంతో, నుస్రత్ చాలా భయపడుతోందట. వీటిని పోలీసుల దృష్టికి కూడా ఆమె తీసుకెళ్లింది. దీంతో లండన్ లో ఆమెకు అదనపు భద్రతను కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 
Nusrut Jahaan
Maa Durga
Actress
Trunamool Congress

More Telugu News