Donald Trump: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డొనాల్డ్ ట్రంప్... వైట్ హౌస్ కు చేరిక!

Trump Discharged from Hospital

  • కరోనా గురించి ఎవరూ భయపడవద్దు
  • నాకు 20 ఏళ్ల వయసు తగ్గినట్టుంది
  • ట్విట్టర్ లో వెల్లడించిన యూఎస్ ప్రెసిడెంట్

కరోనా సోకి వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తిరిగి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం, సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన డిశ్చార్జ్ అయ్యారు. తనకిప్పుడు చాలా బాగుందని, కొవిడ్ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తన ట్విట్టర్ ఖాతాలో ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ ప్రజల జీవితాన్ని డామినేట్ చేసేలా చేసుకోవద్దని, మనం అభివృద్ధి చెందామని అన్నారు. తన పాలనలో ఎన్నో గొప్ప గొప్ప ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, తనకిప్పుడు 20 సంవత్సరాల వయసు తగ్గిపోయినట్లుందని అన్నారు.

ఆపై తాను డిశ్చార్జ్ అయి, ఎయిర్ ఫోర్స్ వన్ చాపర్ లో తిరిగి వైట్ హౌస్ చేరుకుంటున్న వీడియోను ట్రంప్ పోస్ట్ చేశారు. ఇక ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారన్న వార్తల నేపథ్యంలో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరుగగా, నాస్ డాక్ 466 పాయింట్లు పెరిగింది. ఈ విషయాన్ని మరో ట్వీట్ లో ప్రస్తావించిన ట్రంప్, ఇది అమెరికాకు గొప్ప వార్తని, మన ఉద్యోగాలు మనకే ఉంటాయని అన్నారు. కాగా, ట్రంప్ కు మరో వారం పాటు వైట్ హౌస్ లోనే చికిత్సను అందించాలని వైద్యులు నిర్ణయించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News