Nani: 'టక్ జగదీష్' షూటింగ్ మొదలు.. జాయిన్ అయిన నాని!

Nani joins his latest flick Tuck Jagadish shoot

  • శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్'
  • హీరోయిన్లుగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్
  • లాక్ డౌన్ కి ముందు నలభై శాతం షూటింగ్

టాలీవుడ్ లో మళ్లీ  షూటింగుల కళ కనిపిస్తోంది. లాక్ డౌన్ కారణంగా గత ఆరు నెలల నుంచీ షూటింగులు ఆగిపోయిన సంగతి విదితమే. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగులు చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, మొన్నటి వరకు చాలా మంది భయంతో వెనుకంజ వేశారు. అయితే, ఇప్పుడు ఒకరిని చూసి మరొకరు జాగ్రత్తలు తీసుకుంటూ, సెట్స్ కి వెళుతున్నారు.

ఈ క్రమంలో నాని కూడా తన తాజా చిత్రం షూటింగును మొదలెట్టాడు. 'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా 'టక్ జగదీష్' పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. లాక్ డౌన్ కి ముందు ఈ చిత్రానికి సంబంధించిన నలభై శాతం షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ తో బ్రేక్ పడింది.

తిరిగి ఈ రోజు నుంచి హైదరాబాదులో ఈ చిత్రం షూటింగును నిర్వహిస్తున్నారు. నాని కూడా ఈ రోజు షూటింగులో పాల్గొన్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు.

Nani
Shiva Nirvana
Ritu Varma
Aishvarya Rajesh
  • Loading...

More Telugu News