Alla Nani: స్విమ్స్ మృతురాలి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం: మంత్రి ఆళ్ల నాని

AP govt announces 10 lakhs exgratia to Radhikas family

  • కోవిడ్ సెంటర్ పెచ్చులు ఊడిపడి రాధిక మృతి
  • గాయపడ్డవారికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం
  • రాధిక మరణంపై ఆళ్ల నాని ఆవేదన

తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లోని కోవిడ్ సెంటర్ బిల్డింగ్ పెచ్చులు ఊడిపడి రాధిక అనే అటెండర్ అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాధిక కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ఇస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. గాయపడినవారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. రాధిక మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

రాధిక భర్త కూడా స్విమ్స్ లోనే పదేళ్లకు పైగా ఎంఎన్ఓగా పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం వీరికి పెళ్లయింది. రెండేళ్ల క్రితం వీరి ఇద్దరి కుమారులు వారం వ్యవధిలోనే తీవ్రమైన జ్వరంతో చనిపోయారు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆమె మళ్లీ గర్భం దాల్చడంతో ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆమె ప్రమాదవశాత్తు చనిపోవడం బాధాకరం. ఆమె భర్త హరి పరిస్థితి దారుణంగా ఉంది. సర్వస్వాన్ని కోల్పోయానంటూ ఆయన రోదిస్తున్నారు.

  • Loading...

More Telugu News