Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి యూపీ పోలీసుల క్షమాపణ

UP police apology to Congress leader priyanka gandhi

  • కార్యకర్తలను పోలీసుల బారి నుంచి రక్షించేందుకు ప్రియాంక యత్నం
  • కుర్తా పట్టుకుని లాంగేందుకు పోలీసు యత్నం
  • తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు క్షమాపణలు చెప్పారు. హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ఈ నెల 3న సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక బయలుదేరారు.

ఈ క్రమంలో నోయిడా ఫ్లైఓవర్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. దీంతో పోలీసుల బారి నుంచి కార్యకర్తలను రక్షించేందుకు ప్రియాంక పరుగున వెళ్లారు. దీనిని గమనించిన ఓ పోలీసు ప్రియాంక కుర్తా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రియాంక కింద పడబోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. ప్రియాంకపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై మహిళా పోలీసు అధికారితో దర్యాప్తు జరిపించనున్నట్టు చెప్పారు. మహిళల భద్రత, వారి గౌరవానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News